Kakani Govardhan Reddy: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. లోన్ యాప్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని.. వీటిపై వెంటనే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. లోన్ యాప్ నిర్వాహకుల గ్యాంగ్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారని తెలిపారు. ఆ గ్యాంగ్…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ…
దమ్ముంటే రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దిగుబడి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట నష్టపోతే రైతులకు కూడా నష్టపరిహారం ఇస్తున్నాం, రైతులకు మేలు జరుగుతుంటే కొందరు తట్టుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇంత పరిహారం ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. దమ్ముంటే వివరాలు చెప్పండి అని చాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో…
వ్యవసాయ రంగంపై పలు ప్రశ్నలు సంధిస్తూ.. రైతుల్ని అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్‌కు నారా లోకేష్ రాసిన లేఖపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేష్ ఏమైనా హరిత విప్లవ పితామహుడా? లేక వ్యవసాయ రంగ నిపుణుడా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు అయినంత మాత్రాన.. ఏది పడితే అది అడిగేస్తారా? అని ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తనకే ఇబ్బందికరంగా ఉందని అన్నారు.…
నాలుగో ఏడాది తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందించే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్ మాత్రమే అన్నారు. RBK ల ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 10,779 RBK లను ఏర్పాటు చేయడం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.…
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా జగన్ మొదటి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ నేతలు ఎందరో ఉన్నా అనిల్ కుమార్‌కు జగన్ అవకాశం ఇచ్చారు. కీలకమైన భారీ నీటిపారుదల శాఖకు మంత్రి అయ్యారు. మూడేళ్ల సమయంలో అనిల్ తనదైన శైలిలో కొనసాగారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సర్వేపల్లి ఎంఎల్‌ఏగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానం దక్కింది. అనిల్ కుమార్ మాజీ అయ్యారు. మరుసటి రోజే…
సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ పామ్ ధరలను నిర్ణయించనున్నట్టు తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. అమరావతిలో ఇవాళ ఆయిల్ పామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తాం.. సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ మ్‌మ్ ధరలను నిర్ణయిస్తామ.. ఓఈఆర్ (ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అప్‌డేట్ చేస్తామని వెల్లడించారు.. ఇక, అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని…
నెల్లూరు జిల్లాలోని పెన్నా, సంగం బ్యారేజ్ పనులను సోమవారం ఉదయం మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని .. ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30 శాతం పనులు చేసి టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని.. త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కాకాణి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు,…