Off The Record: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొలిక్కి వచ్చిందా..? ఇక నాన్చొద్దు… వాళ్ళ సంగతి తేల్చేయాల్సిందేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టిగా డిసైడ్ అయ్యారా..? వేటుపడేది ఎవరి మీద? సేఫ్‌జోన్‌లో వెసులుబాట్లు ఎవరికి? నోటీసులకు ఇప్పటిదాకా సమాధానం ఇవ్వని ఆ ఇద్దరి సంగతేంటి? ఆ పంచాయితీకి ముగింపు ఏంటి?
Read Also: Maanya Anand: కమిట్‌మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు.. హీరో ధనుష్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్స్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. మొదటి విడత నలుగురిపై విచారణ ముగిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పఠాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్‌ల విచారణ ముగిసింది. తీర్పు రిజర్వు చేసి పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక రెండో విడతలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్ మీద వేసిన పిటిషన్స్ విచారణ జరుగుతోంంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేల్ని పిలిచి ప్రశ్నించారు స్పీకర్. ఫైనల్‌గా రెండు పక్షాలకు క్రాస్ ఎగ్జామిన్‌కు అవకాశం ఇచ్చారాయన. బుధవారం నాడు భద్రాచలం MLA తెల్లం వెంకట్రావ్.. జగిత్యాల MLA సంజయ్‌ల క్రాస్ ఎగ్జామ్ నేషన్ ఉంటుంది.
Read Also: Maoists Arrest: ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులు.. ఏపీవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!
ఈ నెల 20న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అరికపూడి గాంధీ విచారణలో భాగంగా ఇరు పక్షాల అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత…స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఐతే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి…దానం నాగేందర్ విషయంలో మాత్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. స్పీకర్ ఇప్పటికే వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు. వాటికి త్వరలోనే రిప్లై ఇవ్వాలని ఇద్దరు శాసనసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఇద్దరి వివరణ అందిన వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్నిప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..
అయితే, సుప్రీం కోర్టు కూడా నాలుగు వారాల గడువు ఇచ్చినందున ఆ లోపు తుది తీర్పు ఇవ్వాలని భావిస్తున్నారట స్పీకర్. ఓవరాల్‌గా ఈ నెల 23 తర్వాత తీర్పు పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అనర్హత పిటిషన్స్‌పై విచారణ ముగిసింది. తీర్పు కూడా త్వలోనే ఉంటుంది. ఐతే ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్ పెరుగుతోంది. స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు వివరణ ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయా..? లేదా అని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.