తన స్వంత జిల్లా కడపలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రెండురోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు సీఎం జగన్. 10 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు జగన్. 11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు సీఎం. రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఇంటరాక్షన్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్.
మూడు గంటలకు వేంపల్లి చేరుకుని అక్కడి స్థానికులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు వేంపల్లిలో బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5:30 కు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు జగన్. అక్కడే రాత్రి బస చేస్తారు. అనంతరం శుక్రవారం 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు.
8.45కు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొంటారు. ఈనెల 7, 8వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు.
Dengue Outbreak: మారిన వాతావరణం- గ్రేటర్ పై వైరల్ పంజా