YS Jagan: ప్రేమోన్మాది చేతిలో బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..
- బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ బాలిక హత్య..
- రేపు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్న వైసీపీ అధినేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్.. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యాన్ని చెప్పనున్నారు.. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయనగర్ లో ఉన్న బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి.. వారిని ఓదార్చ నున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బద్వేల్ చేరుకోనున్న జగన్.. బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన పులివెందులకు చేరుకుని రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు.
Read Also: MechanicRocky : మొన్న చూసుకున్న చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను : విశ్వక్ సేన్
Also Read
కాగా, ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఇంటర్ విద్యార్ధిని.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. ఇక, ఈ ఘటనకు కారకుడిగా భావిస్తోన్న ప్రేమోన్మాది విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న విఘ్నేష్‌కు.. ఇంటర్ విద్యార్ధినితో చిన్న నాటి నుంచి పరిచయం ఉండగా.. అతడికి ఇప్పటికే పెళ్లి అయ్యింది.. అయితే, శనివారం ఆమెకి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.. దీంతో, కాలేజీ నుంచి బాలిక ఆటోలో బయల్దేరగా.. ఆ తర్వాత విఘ్నేష్ కూడా మధ్యలో అదే ఆటో ఎక్కాడు.. బద్వేల్‌కు దాదాపు 10 కిలో మీటర్ల దూరంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి ఆటో దిగి.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో ఏమో.. కానీ.. కొంతసేపటికి ఆ బాలికపై విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు.. ఆ బాలిక కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం.. వారు బాలికను ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత ఆ బాలిక మృతిచెందిన విషయం విదితమే..
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!