అది స్వపక్షమైనా, విపక్షమైనా…. ప్రత్యర్థులన్నవాళ్ళు లేకుండా చేసుకోవడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యమా? విపక్ష శిబిరంలో ఉన్న కాస్తో కూస్తో పవర్‌ని లాగేసే కార్యక్రమం పూర్తయ్యాక… ఇప్పుడు టీడీపీలోని ప్రత్యర్ధులపై దృష్టి పెట్టారా? వాళ్ళని తరిమేయండని మినీ మహానాడు సాక్షిగా కేడర్‌కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ మీదున్నారు? రెండు దశాబ్దాలుగా కడప అసెంబ్లీ సీటులో సైకిల్ పార్టీకి గెలుపన్నదే లేదు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో 2024…