చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977…