Diwali Wishes: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీకి నాలుగు రోజులపాటు వెళ్లి.. సీఎం ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేసారు. గత ఏడాది లాగే ఈ ఏడాది వరదలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత ఏడాది లక్ష ఇళ్లలో నీళ్లు వస్తె ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మూసీ రివర్ మీద కార్పొరేషన్ ఎర్పాటు చేసి రుణాలు తీసుకున్నది కానీ, ఒక్క అడుగు కూడ ముందుకు వెళ్ళలేదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఏర్పాటు…
జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ తండ్రి…
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే…
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో యాదాద్రి పర్యటించిన ఆయన.. పలు కీలక మార్పులు, చేర్పులు సూచిస్తూ వచ్చారు. అయితే, రేపు మరోసారి యాదగిరి గుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం.. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ…
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, రేపు రాజధానికి చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలు చాలా ఉన్నాయి.. కృష్ణా నది జలాల విషయం జల జగడం రోజు రోజుకీ రెండు రాష్ట్రాల…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…
భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని…