ఢిల్లీకి నాలుగు రోజులపాటు వెళ్లి.. సీఎం ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేసారు. గత ఏడాది లాగే ఈ ఏడాది వరదలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత ఏడాది లక్ష ఇళ్లలో నీళ్లు వస్తె ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మూసీ రివర్ మీద కార్పొరేషన్ ఎర్పాటు చేసి రుణాలు తీసుకున్నది కానీ, ఒక్క అడుగు కూడ ముందుకు వెళ్ళలేదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఏర్పాటు చేసి మభ్య పెట్టారు తప్పా మూసీ అభివృద్ది జరగలేదని విమర్శించారు. కొంత మంది మూసీ నది ఆక్రమించుకొని పేదలకు రెంట్ కు ఇస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఆక్రమణలను నిరోధించామని , శాసనసభలో ఉన్నప్పుడు గతంలో కోరామని గుర్తుచేసారు. సబర్మతి నది పరిశీలించి వచ్చి కూడా 5ఏళ్లు అవుతుందని మండిపడ్డారు. మూసీ ప్రాంతమంతా బడుగు బలహీనర్గాలు ఉండే ప్రాంతమని అన్నారు.
read also: Fire Accident At Ranbir Film Set: స్టార్ హీరో సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం..!
దీన్నీ అభివృద్ది చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. సీఎం కేసీఆర్ గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్ నుంచి బయటికీ వచ్చి ప్రజలను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడేమో సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిపారు. ఆసలు ఢిల్లీకి నాలుగు రోజులపాటు వెళ్లి సీఎం ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదని, సీఎం ఏ మాత్రం కారణం లేకుండా ఢిల్లీ వెళ్లడం విచార వ్యక్తం చేస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని కోరుతున్న sdrf నిధులు ఖర్చు చేయలేదని ఆడిట్ లో తేలిందని మండిపడ్డారు. ఇందులో కేంద్రం వాటా కూడా చాలా ఉందని విమర్శించారు. మీరు కేంద్ర ప్రభుత్వంపై చేస్తూన్న విష ప్రచారంను ఎవరు పట్టించుకోవట్లేదని అన్నారు. ఇంకా మీకు పరిపాలనకు కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది, కావున ఉన్నాని రోజులు మంచి పనులు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.