కొందరు కొన్ని పాత్రలలో జీవించేసి, సదరు పాత్రల ద్వారానే జనం మదిలోనూ చెరిగిపోని స్థానం సంపాదిస్తారు. వారి పేరు వినిపించగానే, చప్పున గుర్తుకు వచ్చేవి ఆ యా పాత్రలే. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రిగా జీవించిన జె.వి.సోమయాజులు పేరు తలవగానే అందులోని ఆయన పాత్రనే మన కళ్ళముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ‘శంకరశాస్త్రి’ పాత్ర, సోమయాజులు పేరుకు పర్యాయపదంగా మారింది. ఆ తరువాత కూడా అనేక చిత్రాలలో సోమయాజులు పలు గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు. చివరి రోజుల్లో…