Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
నోట్ల కట్ల వ్యవహారంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న తరుణంలో సుప్రీం ధర్మాసనాన్ని వర్మ ఆశ్రయించారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 14న ఢిల్లీలో ఆయన నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కల్లో చూపించని నగదుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన్ను ప్రస్తుతం అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు.