Justice Surya Kant: జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఆస్తుల వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ దేశవ్యాప్తంగా కోట్లాది విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు, భూమి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నగలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి గురుగ్రామ్, హిస్సార్ వరకు రియల్ ఎస్టేట్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త సీజేఐ కుటుంబం బ్యాంకు ఎఫ్‌డిలు, బంగారం, వాహనాలను కలిగి ఉంది.…
Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి…
Justice Surya Kant: ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23న ముగియనుంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సూర్యకాంత్‌ను జస్టిస్ గవాయ్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు ఆమోదం పొందితే నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా విధులను స్వీకరించవచ్చు. ఆయన తన పదవీకాలం ముగిసే వరకు, అంటే ఫిబ్రవరి 9, 2027 వరకు సీజేఐగా కొనసాగవచ్చు. READ ALSO:…
Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ…
నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా?
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను గట్టిగా మందలించింది సుప్రీం కోర్ట్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది నుపుర్ శర్మ. తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మకు అక్షింతలు వేశారు.…