Lokayukta MUDA Probe: కర్ణాటక హైకోర్టు గురువారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను జనవరి 28లోపు సమర్పించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ 24 నాటికి లోకాయుక్త నివేదికపై పురోగతిని చూపించాల్సిందని ఆదేశించిన కింది స్థాయి కోర్టు ఆదేశాలను, హైకోర్టు ఇప్పుడు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్నా ఉండగా.. జనవరి 28 వరకు లోకాయుక్త నివేదిక సమర్పించకూడదని ఆదేశించారు. Also Read: CM…
Bengaluru: దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. ‘‘తన భర్త తన కన్న పెంపుడు పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు’’ అంటూ భార్య కేసు పెట్టింది. సాధారణ వైవాహిక సమస్యగా ప్రారంభమైన ఈ వివాదం కోర్టుకు చేరింది. తన భర్త పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, పిల్లి తనను రక్కిందని భార్య తన కేసులో పేర్కొంది.
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని కోర్టు రద్దు చేసింది.
Karnataka High Court: ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ’’ని చూడటం నేరం కాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది నేరాన్ని ఆకర్షించదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. పిల్లల అశ్లీల వెబ్‌సైట్‌ని 50 నిమిషాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది.