Karnataka High Court: ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ’’ చూడటం నేరం కాదు..
- చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షించడం నేరం కాదు..
- ప్రసారం లేదా ప్రచురించడం ఐటీ సెక్షన్ ప్రకారం నేరం..
- కర్ణాటక హైకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ’’ని చూడటం నేరం కాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇది నేరాన్ని ఆకర్షించదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. పిల్లల అశ్లీల వెబ్‌సైట్‌ని 50 నిమిషాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌పై అశ్లీల వెబ్‌సైట్ చూశాడని ఆరోపణలు వచ్చాయి. ‘‘కోర్టు దృష్టిలో IT చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం వాటిని ప్రసారం చేయడం, షేర్ చేయడం నేరం. దీనికి మించి పిటిషన్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవు. 2008లోని సెక్షన్ 67B ప్రకారం వాటిని వీక్షించడం నేరం కాదు’’ అని జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ కేసు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉపశమనం కలిగించింది.
Read Also: Bengaluru mall: ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూర్ మాల్ మూసివేత..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
బెంగళూర్ హోసా కోట్‌కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇనాయతుల్లా ఎన్, మార్చి 23, 2022న పిల్లల అశ్లీల వీడియోలను వీక్షించాడని ఆరోపించారు. ఈ సంఘటనని సైబర్ టిప్‌లైన్ గుర్తించింది. ఇనాయతుల్లా మొబైల్ నంబర్ ఐపీ అడ్రస్‌ని ట్రాక్ చేసిన తర్వాత మే 3, 2023న అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయబడింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 67B కింద క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించింది. అయితే, ఈ కేసు ఈ చట్టం కిందకు వస్తుందా..? లేదా..? అనేదానిపై కోర్టు విచారించింది. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, ప్రచురించడం నేరం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలాంటి కంటెంట్‌ని ప్రసారం చేయడం లేదా ప్రచురించడం చేయలేదని, కేవలం వీక్షించాడని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎం నాగప్రసన్న, ఐటీ చట్టంలోని 67బీలో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఆరోపణలు లేవని తేల్చారు. ఈ చట్టం ద్వారా అశ్లీల వీడియోలు ప్రసారం లేదా ప్రచురించే వారిని మాత్రమే టార్గెట్ చేస్తుందని, వీక్షించే వారిని కాదని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!