The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.