తెలుగు చిత్రసీమలో పలు రికార్డులకు నెలవుగా నిలిచారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినోత్సవ కానుకలుగా అనేక చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు విడుదలైన చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది యన్టీఆర్ కెరీర్ లోనే అధికంగా చూస్తాం. యన్టీఆర్ బర్త్ డేకు విడుదలై విజయం సాధించిన అన్ని చిత్రాల్లోకి అనూహ్య విజయం సాధించిన చిత్రంగా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ సినిమా 1982 మే 28న యన్టీఆర్…