ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ ట్రాపెజియం జోన్‌లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.