నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు అని జూపల్లి విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎవరు పెట్టలేదు.. మీరు ఇందులో ఆదర్శమా.. వేల కోట్లు ఖర్చుపెడతారు.. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర నేతల వరకు అందరిని కొనాలని చూస్తారు..
జూపల్లి కృష్ణారావు అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో నాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని నాగం చెప్పారు.
Jupalli krishna rao: ఈటెల లాంటి వాళ్ళు కూడా మాతో వస్తారని, ఇంకా ఎవరెవరు వస్తారు అనేది మీరే చూస్తారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతోపాటు కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. జూపల్లి , పొంగులేటి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్త
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది.