Jupalli krishna rao: ఈటెల లాంటి వాళ్ళు కూడా మాతో వస్తారని, ఇంకా ఎవరెవరు వస్తారు అనేది మీరే చూస్తారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాతోపాటు కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. నేను పొంగులేటి ఇద్దరమే కాదు.. చాలామంది మాతో మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని గద్దెదించాలనేదే ఏకైక లక్ష్యమని తెలిపారు. ఎవరితో అది సాధ్యం అనేది ఆలోచిస్తున్నామన్నారు. జూన్ మొదటి వారంలో సస్పెన్స్ కు తెరపడుతుందని జూపల్లి అన్నారు. ఈటెల లాంటి వాళ్ళు కూడా మాతో వస్తారని, ఇంకా ఎవరెవరు వస్తారు అనేది మీరే చూస్తారని సస్పెన్షన్ లో పెట్టారు. దీంతో పార్టీ వర్గాల్లో ఎవరనేది ఉత్కంఠంగా మారింది.
బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు కాంగ్రెస్ చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. జూన్ 8న జూపల్లి హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. జూపల్లితో పాటు వనపర్తి జిల్లా నాయకులు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అదే రోజు జూపల్లి అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో జూపల్లికి మంచి పట్టు ఉంది. దీంతో జూపల్లి చేరిక మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. జూపల్లి చేరితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది. జూపల్లి బీజేపీలో చేరే అవకాశం లేదని ఈటల రాజేందర్ క్లారిటీ ఇవ్వడంతో కాంగ్రెస్ లో చేరడం లాంఛనమే అని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జూపల్లి కొన్ని షరతులు పెడుతున్నారు. తనతో పాటు పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీ మేఘారెడ్డికి టికెట్ హామీ ఇవ్వాలని కోరుతున్నారు.
కొల్లాపూర్ టిక్కెట్ తనకు ఇవ్వాలని, వనపర్తి నుంచి మేఘారెడ్డికి టికెట్ ఇస్తానని హామీ ఇవ్వాలని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఆయన ప్రతిపాదనలకు అంగీకరించిందనే ప్రచారం జరుగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం జగదీశ్వరరావు, అభిలాష్ రావు ఇప్పటికే పోటీ చేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, శివసేనారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో వారిని పక్కన పెట్టి పార్టీలో చేరిన నేతలకు టిక్కెట్లు ఇస్తే.. ఎప్పటికప్పుడు టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తికి లోనయ్యే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ఎలా బుజ్జగిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. జూపల్లి చేరికతో వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఆయన చేరికతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు ఇతర పార్టీల్లోకి మారే అవకాశం కూడా లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. జూపల్లి చేరికను జగదీశ్వరరావు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరి జూపల్లి చేరికపై అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ ఎలా బుజ్జగిస్తారన్నది ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Telangana Politics: ఆ ఇద్దరు.. ఎటువైపు..?