Jr.NTR Licious Ad: వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు వెండితెర, ఇటు బుల్లితెర రెండింటి మీద తానేంటో ఇప్పటికే పలుమార్లు రుజువుచేసుకున్నారు. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలై 8 నెలలు అవుతున్నా ఇంకా అదే జోరు కొనసాగుతోంది. ఎన్టీఆర్.. ఇటీవల జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడి తన టాలెంట్ తో అందరూ ఆశ్చర్యపోయాలా చేశారు.
Read Also: Kantara Movie: కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార
ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ రావడంతో ఇప్పుడు అదే ట్రెండీ టాపిక్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకెళ్తే ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఎన్టీఆర్ మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఖాతాలో ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు. పాపులర్ ఇండియన్ ఫుడ్ డెలివరీ “హబ్ లిసియస్ ఫుడ్స్” కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇటీవలే ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్ కి సంబంధించిన షూట్ లో కూడా పాల్గొన్నారు. ఈ యాడ్ ను సేమ్ టెంపర్ సినిమా క్లైమాక్స్ ను పోలి ఉంది.
Read Also: Sharukh Khan : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. ఖర్చు తెలిస్తే షాకే
ఈ యాడ్లో యంగ్ టైగర్ తో పాటు రాహుల్ రవీంద్రన్ డైరక్టర్ గా కనిపించారు. యాడ్ స్టార్టింగ్ లో డైలాగ్ ను ఎన్టీఆర్ చెప్పలేక పోయారు. ఆరు పేజీల డైలాగైనా అరసెకన్లో చెప్పగలుగుతారు.. ఈ చిన్న దానిని చెప్పలేకపోతున్నారు అంటూ రాహుల్ అనగా… చేప చిన్నదైనా ఎర పెద్దది వేయాలంటూ లిసియస్ ఫుడ్ యాప్లో చేపలను గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాడ్ చూసిన వాళ్లు ఎన్టీఆర్ న్యూలుక్ సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో చేయబోయే సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పవచ్చు.