ఏపీ సీఎం జగన్ ఈనెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 23న ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకోనున్నారు. ఉదయం 11:15-11:45 గంటల వరకు శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం…