ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.
పాకిస్తాన్‌లోని అకౌంటబిలిటీ కోర్టు సోమవారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతేకాకుండా.. రిమాండ్‌ను పొడిగించాలని ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి ముహమ్మద్ బషీర్ రావల్పిండిలోని అడియాలా జైలులో అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసును విచారించినట్లు అక్కడి ఓ వార్తాపత్రిక తెలిపింది.
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది.
తన జీవిత భాగస్వామిని హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు శుక్రవారం మరో 14 రోజులు పొడిగించింది. అతన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా చంపిన కేసులో పోలీసులు నిందితులను విచారించారు.