ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి ట్రయల్ కోర్టు పొడిగించింది. ఆగస్టు 20 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గురువారం కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఊరట లభించేలా కనిపించడం లేదు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 7 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈసారి కస్టడీని మరో నెలపాటు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యాంక్ మోసం కేసులో డీహెచ్‌ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రూ.34,000 కోట్ల మోసం కేసులో గతంలోనే అరెస్ట్ అయ్యాడు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయనుంది.
MLC Kavitha: నేటితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ ష్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి ఆప్ నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయిం తీసుకుంది.