Jubilee Hills Bypoll Results Live Updates: హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. పోస్టల్ బ్యాలెట్ల నుంచి.. ప్రతీ రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు..
Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాగా.. ఇందులోనూ హస్తం పార్టీ మెజారిటీ కనబరిచింది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది.. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు, బీఆర్‌ఎస్ 8,864 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు…
RV Karnan: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఈరోజు ఎర్రగడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఒక రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు, తెలివితేటలకు ఈ ఎన్నిక ఒక కఠిన పరీక్ష పెట్టిందని అభిప్రాయపడ్డారు. విజ్ఞులైన ప్రజలు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్ల అయింది.…
KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం తెలిపింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తంగా 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. Also Read: Harish Rao: రేవంత్ చీఫ్ మినిష్టర్ కాదు, కటింగ్…
Jubilee Hills Bypoll 2025: హైదరాబాద్, సెప్టెంబర్ 30 – రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉందని ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుధర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి…