తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం తెలిపింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తంగా 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
Also Read: Harish Rao: రేవంత్ చీఫ్ మినిష్టర్ కాదు, కటింగ్ మాస్టర్.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!
ఉప ఎన్నిక పూర్తి డీటెయిల్స్:
# నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 13
# నామినేషన్ల తుది గడువు: అక్టోబర్ 21
# నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
# నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24
# పోలింగ్ తేదీ: నవంబర్ 11
# ఓట్ల లెక్కింపు: నవంబర్ 14