Jubilee Hills By Election: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్.. పార్టీ నేత నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. కానీ… బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అసలా విషయంలో ఒక క్లారిటీ ఉందో లేదో కూడా బయటికి తెలియడం లేదు. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు నాయకులతో కమిటీ వేసి అభిప్రాయ సేకరణ కూడా చేసింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలో… త్వరలోనే ముగ్గురు పేర్లతో రాష్ర్ట ఎన్నికల కమిటీ కేంద్ర పార్టీకి లిస్ట్ పంపబోతోందట.…
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. “బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి డ్రామాలు చేస్తోంది. ఆర్. కృష్ణయ్యతో సహా కొంతమంది బీసీ నేతలు కూడా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధి చూపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అధికారంలోకి…
Madhavi Latha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడి ఎక్కింది. అయితే ప్రముఖ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలని తెగ చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సంబంధించి ఎన్.టి.వి తో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్బంగా మే మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.…
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది. Also Read: Vizag CP: అందుకే.. వైఎస్ జగన్…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్…
తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో.. జూబ్లీహిల్స్ నియోజవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.
భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు.
Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు. Uttarpradesh: కారు ఇంజన్ లో పైథాన్.. లగెత్తరో…