Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్‌లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో…
Off The Record: తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు మళ్ళుతోంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో… హోరా హోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి ప్రధాన రాజకీయపక్షాలు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఈసారి రాష్ట్రంలో…
Off The Record: జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సీనియర్ నేత నవీన్ యాదవ్ పేర్లపై చర్చ జరుగుతోంది. తాజాగా… నేను సైతం అంటూ… తెర మీదికి వచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి… జూబ్లీహిల్స్ టికెట్ ఖచ్చితంగా నాకే ఇచ్చి తీరాలన్నది ఆయన డిమాండ్. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.
తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు.
హైదరాబాద్‌ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడింది.
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?