నటశేఖర కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం తెలుగు సినిమా రంగానికి కౌబోయ్ మూవీస్ ను పరిచయం చేసింది. ఆ సినిమా విజయంతో కృష్ణ మాస్ హీరోగా జనం మదిలో నిలిచారు. ఆ తరువాత కృష్ణ హీరోగా అనేక కౌబోయ్ తరహా చిత్రాలు రూపొందాయి. అయితే ఏవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. కానీ, కృష్ణ అభిమానగణాలు పెరగడానికి ఈ తరహా చిత్రాలు దోహదపడ్డాయి. అలాంటి వాటిలో ‘మావూరి మొనగాళ్ళు’ కూడా చోటు చేసుకుంది. ఈ…