అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే... ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు.
రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా బీజేపీ చేసింది. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జి లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన…
రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి సీనియర్ ఖండిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 ఏళ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్…
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధినేత ఎల్‌కే అద్వానీ హాజరవుతారని విశ్వహిందూ పరిషత్ నేత ఒకరు తెలిపారు.
BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
JP Nadda : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రామమందిరం కోసం పార్టీ నిర్ణయించిన పనులను సమీక్షించారు.