JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు…
ప్రపంచంలోనే బీజేపీ (BJP) అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల అజెండాను నిర్దేశించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ సదస్సును ఢిల్లీలో ప్రారంభించింది.
ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని సార్లు ఓటమిలో కూడా గెలుపు ఉంటుందని, తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ లో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడు.. బీజేపీ ఓటు శాతం అప్పుడు 7.1 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఈ…
మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి.
భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జాతీయ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారయణ.. ఉమ్మడి రాజధానిపై తాజాగా వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన తరుణంలో.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది వైసీపీ.. ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదు అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. అనుభవం వున్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ (Ashok Chavan) లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రెండ్రోజులకే రాజ్యసభ (Rajya Sabha) సీటు దక్కేసింది.
ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే... ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.