సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
BJP : సోమవారం జరిగిన రెండో ఎన్నికల కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. ఆ తర్వాత అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైంది.
బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం…
గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా 13 రోజుల క్రితం (ఫిబ్రవరి 20వ) తేదీన గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమయమే చెబుతుందని బీజేపీకి చెందిన పవన్ సింగ్ అన్నారు. అసన్‌సోల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని పవన్ కలిశారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నిరాకరించిన పవన్ సింగ్.. సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..…
PM Modi : తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.
BJP High Command: తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో..
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
నేడు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.