కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్ పిచ్ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం…