IND vs ENG: ఇది నేను అస్సలు ఊహించలేదు: జోస్ బట్లర్
- తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి
- పిచ్ పొరపాటేమీ లేదన్న బట్లర్
- భారత స్పిన్నర్లు అద్భుత బంతులు వేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్ పిచ్ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ… ‘ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. త్వరగా వికెట్లను చేజార్చుకోవడంతో వెనకపడిపోయాం. వికెట్స్ చేతిలో ఉంటే భారీ లక్ష్యం విధించే అవకాశం ఉండేది. పిచ్ పొరపాటు ఏమీ లేదు. భారత బౌలర్లు పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్నారు. స్పిన్నర్లు అద్భుత బంతులు వేశారు’ అని ప్రశంసించాడు. ఈ మ్యాచులో బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేశాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Gold Rate Today: ఆల్‌టైమ్ హైకి గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా!
‘లోపాలను సరిదిద్దుకొని తర్వాత మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. మంచి బంతులు వేశాడు. మార్క్ వుడ్ వేగవంతమైన బౌలర్. ఈ మ్యాచులో కూడా అతడి స్పీడ్ అద్భుతం. దూకుడగా ఆడే టీమిండియాను అడ్డుకోవాలంటే.. ఏ చిన్న అవకాశంను మిస్ చేసుకోకూడదు. కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పని చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా. మెక్‌కల్లమ్‌కు నేను అతిపెద్ద అభిమానిని. అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం బాగుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!