జేఎన్టీయూ కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైన బుర్రా వెంకటేశం నేడు జేఎన్టీయూని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ కె. వేంకటేశ్వరావుల సమక్షంలో యూనివర్సిటీలోని డైరెక్టర్లను, కాలేజ్ ప్రిన్సిపాల్, క్యాంపస్ కాలేజీలోని పలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆచార్య వర్గాన్ని, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్కు రిజిస్టార్ పరిచయం చేశారు.