DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
PM Modi : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి నవంబర్ 10న వారంలోపే వస్తున్నారు. ఇక్కడ రాజధాని రాంచీలో బీజేపీ అభ్యర్థితో కలిసి రోడ్ షో చేయనున్నారు.
హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.