“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైతం ఎక్కడా కన్పించట్లేదు. తాజా సీజన్ ఇంకా పూర్తి కాకముందే కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు రావడం చూస్తుంటే ఈ నెగెటివ్ టాక్ కు బ్రేక్…
బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అనారోగ్యం కారణంగా జస్వంత్ (జెస్సీ) హౌస్ నుండి బయటకు వచ్చాడు. అతనిది ఎలిమినేషన్ కాదని, కేవలం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నందునే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇక జెస్సీ తిరిగి వెళ్ళే ఆస్కారం లేదన్నది స్పష్టమైపోయింది. అందుకే అతనితో ఇంటి సభ్యులందరితోనూ నాగ్ పర్శనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఇంతకూ విషయం ఏమంటే…. బిగ్…
బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం జస్వంత్ హౌస్ నుండి బయటకు వెళ్ళాడు, అంతే తప్పితే ఎలిమినేట్ కాలేదు! మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో బిగ్ బాస్ జస్వంత్ ను బయటకు పంపాడు. వారం క్రితం అతనికి వైద్య పరీక్షలు చేసి, సీక్రెట్ రూమ్ లో ఉంచిన బిగ్ బాస్, ఇప్పటికీ అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో…
గత పది రోజులుగా వెర్టిగో తో బాధపడుతున్నాడు జస్వంత్. అయితే పంటి బిగువున బాధను భరిస్తూనే, కొన్ని టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇతర ఇంటి సభ్యుల సహకారంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. వారం రోజులు దాటిపోయినా జెస్సీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో నిన్న ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ ను కూడా వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ చూపించింది. అయితే.. ఇవాళ జెస్సీని బిగ్ బాస్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు…