Nitish Kumar promises special status to backward states: బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక హామీ ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కాకుండా విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన అన్నారు. వచ్యే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది విపక్షాల కూటమే అని ఆయన అన్నారు. ఇటీవల ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో భాగంగా ఢిల్లీలో పర్యటించారు సీఎం నితీష్ కుమార్. ఈ పర్యటనలో కాంగ్రెస్ లీడర్…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ పర్యటన మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నమేనని జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్) ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 40 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
CM Nitish Kumar comments on BJP: ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇటీవల బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎనిమిదోసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. మణిపూర్ లో…
జనతాదళ్ (యునైటెడ్) బహిషృత నేత, రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ(68) తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మంగళవారం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ పార్టీ జెండా కప్పుకున్నారు. మూడు రోజుల రాజధాని పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. పవర్ వర్మను పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ వర్మ రాకతో టీఎంసీ బలం పెరుగుతుందని, ఆయన అనుభవాలు పార్టీకి పనిచేస్తాయని మమతా పేర్కొన్నారు. ఇలాంటి…