తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు…
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్‌కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్‌లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్‌లో నవంబర్ 30న దిగ్గజ…
ఎంత గొప్ప మేధావులైనా, జనం నాడి పట్టక పోతే లాభం లేదు – అంటారు. అసలు జనం నాడిని పట్టుకోవడమే పెద్ద విద్య! సదరు విద్యలో ఆరితేరిన వారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే వరుస విజయాలు చూస్తారు. అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు అలాంటివారే! ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన…
ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, ‘అభినయ శారద’గా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నందమూరి బాలకృష్ణగారు మాట్లాడుతూ “జయంతిగారు గొప్ప నటి. అప్పటినుంచి ఇప్పటివరకూ అనేక తరాలతో కలిసి పనిచేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి ‘జగదేకవీరుని కథ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత ‘కుల గౌరవం’, ‘కొండవీటి సింహం’,…