Jaya Bachchan: సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఆగ్రహంతో పక్కకు తోసేసింది. అంతేకాదు ‘ఏం చేస్తున్నావు ..ఏంటిది ?’ అని అతడిపై మండిపడింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయా బచ్చన్ ప్రవర్తనపై నెటిజన్‌లు ఫైర్ అవుతున్నారు. ఇంత యాటిట్యూడ్ పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: TTD: తిరుమలకు వెళ్లే వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!
అయితే, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన భార్య అయిన జయా బచ్చన్ పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు దురుసుగా ప్రవర్తించడం ఇదేం మొదటిసారి కాదు. ఇటీవల పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్ కు ఆ పేరును ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. అలాగే, అధికార పార్టీ ఎంపీలు తన ప్రసంగానికి ఇబ్బంది కలిగించినప్పుడు కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. మీరే, నేనో ఒక్కరే మాట్లాడాలి.. మీరు మాట్లాడేటప్పుడు, నేను సైలెంట్ గా ఉన్నాను.. మరి ఒక మహిళగా నేను మాట్లాడేటప్పుడు.. అంతరాయం కలిగించకుండా నోరును అదుపులో పెట్టుకోండి అని మండిపడింది.
I get the whole 'privacy & permission' thing, but you’re in the public sector, Attitude kis baat ka hai? Bachchan ki biwi hone ka ya khairaat ki Rajya Sabha seat ka? If the ego is this high, next time try winning a Lok Sabha seat on your own #JayaBachchan pic.twitter.com/AvL4ToArjQ
— Prayag (@theprayagtiwari) August 12, 2025