Typhoon Nanmadol: జపాన్ దేశాన్ని అత్యంత శక్తివంతమైన తుఫాన్ నన్మదోల్ భయపెడుతోంది. తీరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తీర ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నన్మదోల్ టైఫూన్ వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో రవాణా సేవలు స్తంభించాయి. నైరుతి జపాన్ లోని కగోషిమా ప్రిపెక్చర్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో భారీగా గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు సముద్రంలో ఎతైన అలలు వస్తున్నాయి.…