Japan Earthquake: జపాన్ భూకంపంలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 92 మరణించారు. మరో 242 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ మొదటి రోజునే భారీ భూకంపం జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసింది. జనవరి 1న మధ్యాహ్నం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం విషాదాన్ని నింపింది. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని అనుకున్న అక్కడి ప్రజలకు కన్నీటిని మిగిల్చింది. దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. కేవలం ఒకే రోజులో 150కి పైగా భూకంపాలు జపాన్ దేశాన్ని తాకాయి.
Myanmar Earthquake : జపాన్ తర్వాత మయన్మార్‌లో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, జనవరి 2న మయన్మార్‌లో 3:15 నిమిషాల 53 సెకన్లకు భూకంపం సంభవించింది.
Earthquake: జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కె తెలిపింది.
Earthquake: జపాన్ దేశంలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.33 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. జపాన్ రాజధాని టోక్యోకు తూర్పు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Earthquake: జపాన్ దేశం మరోసారి భూకంపానికి వణికింది. జపాన్‌లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.42 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సునామీపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. భూకంపం ధాటికి నగానో మరియు కనజావా మధ్య షింకన్‌సేన్ బుల్లెట్ రైళ్లను నిలిపేశారు. సుజీ సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Earthquake: జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు.