TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. Also…
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ - జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
మంగళగిరి వైసీపీ అడ్డా.. అభ్యర్థి ఎవరైనా గెలిచేది వైసీపీ అభ్యర్థేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళగిరి సామాజిక సాధికార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. లోకేష్ను మడత పెట్టేస్తాం, టీడీపీని కృష్ణానదిలో కలిపేస్తామని ఆయన అన్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్లు, వైఎస్ జగన్ గెలిచినట్లు అని మంత్రి తెలిపారు.
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో…