జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.
సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు…
పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ… పిలిచి టిక్కెట్ ఇచ్చే దిక్కులేదు. రమ్మని పిలిచే పార్టీ లేదు. నువ్వొస్తానంటే మేమొద్దంటామని ముఖం మీద తలుపేసేవాళ్ళు తప్ప మాజీ మంత్రి సీనియారిటీని వాడుకుందామనుకునే వాళ్ళు మాత్రం లేరు. చివరికి ఇప్పుడు చేరిన పార్టీలో కూడా వితౌట్ కండిషన్స్ అంటున్నారట. ఇంతకీ అంత దారుణమైన స్థితిలో ఉన్న నాయకుడెవరు? ఎందుకంత దుస్థితి దాపురించింది? కొత్తపల్లి సుబ్బారాయుడు….. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ లీడర్. ఓటమి ఎరుగని నేతగా ట్యాగ్‌లైన్. కానీ… అదంతా…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు.
టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్‌కు దక్కే ప్రాధాన్యత తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేంటంటూ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య.
Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.…
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్ళిపోయాడన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి.. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం…
టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి…