నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లాకు సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా…
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నటుల్లో హైపర్ ఆది ఒకడు. టాలెంట్ ను నమ్ముకొని జబర్దస్త్ లో అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే టీమ్ లీడర్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో ఒక పక్క కమెడియన్ గా చేస్తూనే .. ఇంకోపక్క డైలాగ్ రైటర్ గా మారి తన సత్తా చూపిస్తున్నాడు.
టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ వ్యాఖ్యానించారు.
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట టికెట్టు టిడిపికి కేటాయించడంపై జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొంది . టిక్కెట్ ఆశించి భంగపడిన. జనసేన జగ్గంపేట ఇన్ ఛార్జీ పాఠం శెట్టి సూర్యచంద్ర అంతిమ నిరాహార దీక్షకు దిగారు. తనకు జనసేన నాయకత్వం జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అంతిమ దీక్ష ప్రారంభించారు. పాఠం శెట్టి దంపతులు ఆలయంలోనే ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. . ప్రజలకు…
దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన తర్వాత, ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి రూ. 52 వేల కోట్లకు పైగా కొత్త ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. కాగా, సుదర్శన్ బ్రిడ్జిని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెనను గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో నిర్మించారు. దీనికి ముందు వారణాసి…
గుంటూరు టీడీపీలో లెక్క చిక్కులకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 స్థానాలు ఒక లెక్క ఉంటే.. ప్రకటించాల్సిన ఐదు స్థానాలు మరో లెక్కగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వర్గ పోరు, ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో.. ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ. పలనాడు జిల్లాలోని కీలక నేత యరపతినేని శ్రీనివాసరావు కు సీటును మొదటి…