ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా?
పోటీలో నేను లేనప్పుడు ఎవరు గెలిస్తే నాకేంటి? అది పొత్తు ధర్మమా? మరోటా అన్నది జాన్తానై? మన మిత్ర పక్షం గెలిస్తే ఓకే… ఓడి ప్రత్యర్థి గెలిచినా… నా కులపోడే…కాబట్టి నాకు ఊడేదేం లేదు. ఇలా ఉందట అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వైఖరి. జనసేన గెలిచినా, వైసీపీ గెలిచినా నాకొచ్చేదేంటన్న రీతిలో ఉన్న ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? వైశాల్యం, ఓటర్ల పరంగా చిన్నదైనా…రాజకీయ చైతన్యం పరంగా అతిపెద్ద ప్రభావం చూపగల సెగ్మెంట్…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను.. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు.. ఆ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. సినిమాలకు బ్రేక్ చెప్పి, ప్రచారాలకు ఎక్కువ సమయాన్నీ కేటాయిస్తున్నారు. ఇక ఎప్పటినుంచో అప్డేట్ అడుగుతుంటే.. తరువాత తరువాత అని వెనక్కి తగ్గే హరీష్ శంకర్.. ఈరోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేశాడు.