Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత విషయంలో వైసీపీని ఏ పార్టీ దాటలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Karumuri Nageswara Rao: బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ దాటలేదు అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజ్యసభలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు.. వైసీపీని చూసి తల ఎక్కడ పెట్టుకుంటారు..? అని ఫైర్ అయ్యారు. ఇక, బీజేపీ, టీడీపీలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. మమ్మల్ని విమర్శించిన చంద్రబాబు.. కడప నుంచి అభ్యర్దిని తీసుకు వచ్చి ఏలూరు పార్లమెంట్‌కు పెట్టడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప నుంచి ఎక్స్‌పోర్ట్ చేసిన వ్యక్తి యనమల అల్లుడైతే ఏలూరు ప్రజలు ఓట్లు వేస్తారా..? అని నిలదీశారు.
Read Also: Penamaluru: పెనమలూరు పంచాయితీ.. చంద్రబాబు, లోకేష్‌పై దేవినేని స్మిత ఫైర్
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
మరోవైపు.. టీడీపీ-జనసే-బీజేపీ బహిరంగ సభలపై సెటైర్లు వేశారు కారుమూరి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. వైసీపీ సిద్ధం సభలను చూసి మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీలు సభలు పెడుతున్నా ఆదరణ దక్కడం లేదన్నారు. ఇక, చంద్రబాబు నీచకృత్యాలు ఆయన అనుచరుల రూపంలో బయట పడుతున్నాయి.. డ్రగ్స్ తీసుకు వచ్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో చంద్రబాబు అనుచరులు డ్రగ్స్ పై పడ్డారని విమర్శించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కొరుకుంటుంటే.. కాపు పెద్దలకు ఎక్కడ సీట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!