కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు…
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నేత చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు నాగబాబు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. మూడు పార్టీలను కలుపుకుని పని చేస్తానని, పోలవరంలో భారీ మెజారిటీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా.. ఇక్కడి నుంచి టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.
ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
Manchu Manoj: మంచు కుటుంబంలో మనోజ్ ఒక్కడే.. ఎలాంటి ట్రోల్స్ లేకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమైన మనోజ్.. మంచి మంచి కథలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా అతని కెరీర్ సరిగ్గా నడవడంలేదని తెల్సిన విషయమే.
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.