వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు .. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
పవన్పై పేర్ని నాని వ్యాఖ్యలపై నిరసనగా పేర్ని నాని ఇంటి ముందు జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పేర్ని నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించి.. జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కూడా జనసేనకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు.. మీరు ఏకాకి గా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు..
ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు.
Pantham Nanaji: కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు.. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం స్టార్ట్ అయింది.
JanaSena: ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు.