Chandrababu- Pawan: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు.
వైసీపీలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరబోతున్నారా? వెళ్ళాలి... వెళ్ళిపోవాలంటూ... మనసు తెగ లాగేస్తోందా? ఎప్పుడెప్పుడు గ్లాస్ పట్టుకుందామా అని ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నా... గతం వెంటాడుతోందా? నాయకత్వం సంగతి తర్వాత ముందు జనసైనికులే అడ్డుకుంటారన్న భయం ఉందా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయన మనసు లాగుడు మేటర్?
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.…
స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక కోసం ప్రజల భాగస్వామ్యం కోసం అభిప్రాయ సేకరణ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. యాభై వేల ప్రజల నుంచి విభిన్న ఆలోచనలతో అభిప్రాయ సేకరణ జరిగిందని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కమర్షియల్ క్రాప్స్ పండించే రైతన్నకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..
CPI Ramakrishna: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్ఎస్ఎస్ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు.
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.
నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది.. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కల్యాణ్.
ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
Velampalli Srinivas: ఏపీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకే లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆధారాల్లేకుండా అడ్డమైన ఆరోపణలు చేశారు.. తప్పు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదు? అని ప్రశ్నించారు. కంటితుడుపు కోసం ఇప్పుడు సిట్ వేశారు.