దర్శకుడు శంకర్ గురించి, నిర్మాత దిల్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా ఈ మేరకు కామెంట్ చేశారు. నేను చాలా తక్కువ ది సినిమాలే, థియేటర్ కి వెళ్లి చూసేవాడిని. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కొని సినిమా ధియేటర్ కి వెళ్ళాను. రాజకీయాలు సంగతి పక్కన…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహారిస్తూ ఫుల్ జోష్ నింపారు.
బెజవాడ నగరపాలక సంస్థలో మేయర్కు...పదవీగండం తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు వైసీపీకి 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం దాని 38కి పడిపోయింది. వీరిలో మరో 10 మందికి పైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 64 మంది కార్పొరేటర్లున్న బెజవాడ కార్పొరేషన్లో...మేయర్ పీఠానికి 33 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో ఏడుగురు వెళ్లిపోతే...మేయర్ కుర్చీ ఆ పార్టీకి దూరమైనట్టే. ఇప్పటికే ఐదుగురు టీడీపీలోకి, నలుగురు జనసేన, బీజేపీలో ఇద్దరు…
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఔట్లో రేవు పార్టీ జరిగినట్టుగా నెట్టింట వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా.. వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలతో…
ఈ రోజు జనసేన పార్టీలో చేరారు వైసీపీ నేతలు.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, ఆప్కో మాజీ ఛైర్మన్ గంజి చిరంజీవి. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.. వారికి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్..
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా జనసేన పార్టీ కోసం పని చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పేర్కొన్నారు. నాగబాబు ముందుగా ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, మంత్రి పదవి విషయం తర్వాత ఆలోచిస్తాం…
కూటమీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది.. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు.. అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది.. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్.. ఉదయం 10.30 గంటలకు బల్లగరువు ప్రాంతానికి చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం…
పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో.. తన ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2019లో నన్ను గెలిపించలేదు.. పరీక్షించారు.. నిలబడతాడో లేదో అని.. అది మంచిదేనని పేర్కొన్నారు..