విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కూర్మన్న పాలెంలోని బహిరంగ సభలోపవన్ మాట్లాడారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారన్నారు. నాకు ఒక ఎంపీ కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారు. అయినా ప్రజల సమస్యల కోసం నిలబడేది మేమేనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ లేఖలు రాసిందని చెబుతుంది.…
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. వారికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు చేరుకున్న పవన్.. కూర్మన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో విన్నవించి విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. అవసరమైతే సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలవండి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి యువకుడు జైతెలంగాణ…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేనాని బహిరంగ సభ జరగనుంది. ఈ సభ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు పవన్ కళ్యాణ్.ఆయనకు అడుగడుగునా వేలాదిమంది స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇవాళ పవన్ కల్యాణ్ విశాఖపట్నం రానున్నారు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గం.కు సభ ప్రారంభమవుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.…
ఆంధ్రప్రదేశ్లో గంజాయి, డ్రగ్స్ పాలిటిక్స్ తీవ్రస్థాయిలో విమర్శలు, బూతుల వరకు వెళ్లాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.. 2018 నుంచి తాను గంజాయి స్మగ్లింగ్ విషయాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఆరోపించారు. ఇక, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్తగా…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వైసీపీ- టీడీపీ నేతల మధ్య విమర్శల మాటల దాడి, ప్రతి దాడులు కొనసాగుతుంటే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలిచేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పార్టీ బలంగా ఉన్న కోస్తా జిల్లాలో ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం 40-50 స్థానాల్లో సర్వే చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో జనసేన దోస్తీ కట్టనున్నట్లు వినికిడి.…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకోనుంది. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఓటమిని ఊహించి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో బద్వేల్ వైసీపీ అభ్యర్థి గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తోంది. అయితే అనుహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పోటీలో నిలిచాయి. బీజేపీ తరుఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ బద్వేల్ లో ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ప్రచారం ముగియడానికి…
కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి. ప్రధాన మంత్రి నరేంద్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ అనంతరం సినిమాలను దూరం పెట్టిన పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ‘వకీల్ సాబ్’తో పాటు ఆయన వరుసగా మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్…